హమాస్ ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ తమ పోరు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచనల వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరకి ఆ దేశానికి బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం గాజాను దిగ్బంధించి.. అక్కడ ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షలతో.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్లలో మరింత ఆగ్రహం పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. అలాగే ఈ చర్యలు ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతును కూడా బలహీనపరుస్తాయని చెప్పారు. ఓవైపు హమాస్ దాడులను ఖండిస్తూనే.. మరోవైపు యుద్ధంలో ప్రాణనష్టాన్ని పట్టించుకొకపోవడంతో.. చివరికి ఇజ్రాయెల్‌కే ఎదురుతగిలే ప్రమాదం ఉందంటూ ఒబామా పేర్కొన్నారు. హమాస్ దాడులను ఖండిస్తూనే తనను రక్షించుకునే విషయంలో ఇజ్రాయెల్‌కు తన మద్దతును పునరుద్ఘాటించారు ఒబామా.
పూర్తిగా చదవండి..Barack Obama: గాజాపై ఇజ్రాయెల్ పోరు.. ఆ దేశానికే ఎదురుదెబ్బ తగలవచ్చన్న ఒబామా..
గాజాపై ఇజ్రాయెల్ తమ దాడులు కొనసాగిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యకుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరికి ఆ దేశానికి బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గాజాను దిగ్బంధించి.. అక్కడ ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షలతో.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్లలో మరింత ఆగ్రహం పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఈ చర్యలు ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతును కూడా బలహీనపరుస్తాయని చెప్పారు.

Translate this News:











