Interesting facts about Sun: చంద్రయాన్ -3(chandrayaan 3) విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోంది. ఆదిత్య ఎల్ – 1(Aditya L1) ప్రయోగం విజయవంతమైనదని ఇస్రో తెలిపింది. దేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ అయిన ఆదిత్య-ఎల్1ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల దేశం గర్విస్తోందని, సంతోషిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహన పెంపొందించడానికి అవిశ్రాంతంగా శాస్త్రీయ ప్రయత్నాలు కొనసాగుతాయిని ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. ఇక ఆదిత్య L1 మిషన్ వేళ సూర్యుడి గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. సన్ గురించి అనేక విషయాలను తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
సూర్యుడి గురించి ఆసక్తికర నిజాలు:
Aditya L1: అక్కడ నుంచి చూస్తే సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు.. సన్ గురించి ఆసక్తికర విషయాలివే!
మన పాలపుంత గెలాక్సీలోని 100 బిలియన్ నక్షత్రాలలో సూర్యుడు ఒకడు. సూర్యుడి వయస్సు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఆదిత్య ఎస్1 ప్రయోగం వేళ సూర్యుడి గురించి ఆసక్తికర విషయాలు తెలసుకునేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. సూర్యుడి శక్తి లేనిదే భూమిపై రుతువులు, జీవరాశులు ఉండవు. కాబట్టి సూర్యుడు మనకు ప్రాణదాత.

Translate this News:











