గుంటూరులో మంత్రి జోగి రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోస్తాంధ్రలో మొట్టమొదటిసారిగా సామాజిక యాత్ర భేరి మోగించబోతుందన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సామాజిక ధర్మాన్ని జగన్ పాటించారన్నారు. నాలుగున్నరేళ్లలో దమ్ముగా మేం తల ఎత్తుకునేలా చేశారన్నారు రమేశ్. మాకు జగన్ అనే ఒకే ఒక్క నాయకుడున్నాడని సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. సామాజిక సాధికారిత ద్వారా 175 నియోజకవర్గాల్లో మాకు జరిగిన మేలును వివరిస్తామని తెలిపారు. చంద్రబాబు పాపం పండిందని.. 40 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడిందని మంత్రి విమర్శించారు.
పూర్తిగా చదవండి..AP politics: దమ్ముగా తల ఎత్తుకునేలా చేశారు: మంత్రి జోగి రమేశ్
వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో చెప్పాలని నారా భువనేశ్వరిపై మండిపడ్డారు మంత్రి జోగి రమేశ్. నిజం గెలిచింది.. నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని విరుచుకుపడ్డారు. ఇక తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైయింది. జెండా ఊపి బస్సు యాత్రను రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేశ్, జోగి రమేశ్ ప్రారంభించారు

Translate this News:











