ప్రయాణికులు రైల్లో ప్రయాణం చేయాలంటేనే భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదాన్ని ప్రతీ ఒక్కరూ గర్తుంచుకునే ఉంటారు. అంతే కాకుండా ఇటీవల రైల్లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతోపాటు పలు ప్రాంతాల్లో రైలు బోగీల కింద మంటలు చెలరేగడంతో రైల్వే ప్రయాణికుల భయం అంతా ఇంతా కాదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని మడుగు రైల్వేస్టేషన్ సమీపంలో హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగలు వస్తుండంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి రైలు నుంచి పరుగులు పెట్టారు.
పూర్తిగా చదవండి..Train accident: ట్రైన్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి పరుగులు తీశారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న రైల్వే అధికారులు.. బ్రేక్ లైనర్ల వల్ల పొగలు వ్యాపించినట్లు స్పష్టం చేశారు.

Translate this News:











