లోన్లీ(Lonely)గా ఉండడం అంటే ఒక్కరే ఉండడమని కాదు. చుట్టూ వంద మంది ఉన్నా ఈ లోకంలో లేకపోవడం. చాలామంది ఒంటరితనం అంటే సింగిల్‌గా లైఫ్ లీడ్ చేసేవాళ్లు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కొంతమంది సోలో లైఫ్ లీడ్ చేస్తున్న కూడా ఎంతో హ్యాపీగా ఉంటారు. మరికొంతమంది మాత్రం నలుగురితో ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు. మరికొంతమంది జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటలను నిత్యం తలుచుకుంటూ అదో లోకంలో బతుకుతుంటారు. ఇంకొంతమంది ఎవరో చేసిన అన్యాయాన్ని భరించలేక లైఫ్‌లో కావాల్సినవాళ్ల అందరిని దూరం చేసుకుంటారు. ఒంటరిగా గడుపుతుంటారు. అలాంటి వారికి నిద్ర విషయంలో అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Sleeping problems: నిద్రకు అతి పెద్ద శత్రువు ఏంటో తెలుసా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
ఒంటరితనం నిద్రను బ్యాడ్‌గా ప్రభావితం చేస్తుంది. ఒంటరితనం నిద్రకు అనేక విధాలుగా భంగం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనం నిద్రలేమికి దారితీస్తుంది. ఒంటరితనం ఒత్తిడి, ఆందోళన స్థాయిలను పెంచి.. రెస్ట్ తీసుకోడానికి, నిద్రపోనివ్వడాన్ని కష్టతరం చేస్తుంది.

Translate this News:












