మనిషికి నిద్ర అవసరం. తిండి, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న లైఫ్స్టైల్ల్లో చాలా మంది బిజీ బతుకుల్లో పడి సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆఫీస్ వర్క్ చేసేవాళ్ల సంఖ్య పెరుగుతున్నారు. దీని వల్ల టైమ్‌కి నిద్రపోవడం లేదు. నిజానికి వర్క్ పట్ల డెడికేటెడ్‌గా ఉండడం మంచి విషయమే కానీ అది మన ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టి కాదు. అటు విద్యార్థులు సైతం ఈ మధ్య కాలంలో తక్కువ సేపు నిద్రపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఉదయం అంతా ఏదో ఒక విషయంలో టైమ్‌పాస్ చేస్తూ రాత్రి మాత్రం పుస్తకాలు తీసి చదువుతున్నారట. ఇలా నైట్ అంతా చదివి మార్నింగ్ కాస్త లేట్‌గా లేస్తున్నారని తెలుస్తోంది. ఇలా లేట్ నైట్ రీడింగ్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. తెల్లవారుజామున లేచి చదవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఇలా చదువు, వర్క్‌లో పడి రోజుకు మీరు కూడా 7 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా? అయితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Sleep Tips: రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే జరిగేది ఇదే..!
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్రం రాత్రి 7-9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మన జీవితకాలం తగ్గిపోతుంది. బరువు పెరుగుతారు. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మానసిక సమస్యలు వస్తాయి. తక్కువ సేపు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.

Translate this News:











