ఉదయం కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కొంచెం టీ కానీ కాఫీ తోపాటు అల్పాహారం తీసుకోవడం చాలా మందికి అలవాటు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. అంతేకాదు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు ఆకలి అదుపులో ఉంటుంది. అంతేకాదు శరీర బరువును కూడా అదుపులో ఉంచుకునేందుకు బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉండటంతోపాటు నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ సక్రమంగా తగ్గిపోతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా మంచిది.
పూర్తిగా చదవండి..Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!!
ఉదయాన్నే అల్పాహారం తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మధ్యాహ్న భోజనం సమయం వరకు యాక్టివ్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అల్పాహారాన్ని స్కిప్ చేయడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. వేగవంతంగా ఉంటాయి. అయితే కొంతమంది బరువు పెరుగుతున్నామని...ఇతర కారణాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. దీని వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?

Translate this News:











