AP SKILL development scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ వ్యాప్తంగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ డబ్బు రూ.241 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలున్నాయి. ఈ ఆరోపణలపైనే చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా తెలుగుదేశం నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు
పూర్తిగా చదవండి..CBN Row: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిర్బంధాలు.. చంద్రబాబు అరెస్ట్‌తో హై డ్రామా!
నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో హైడ్రామా నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్ట్ అవ్వడంతో ఏపీలోని అన్ని జిల్లాలో టీడీపీ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇటు నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

Translate this News:











