టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ 10వ రోజుకు చేరుకుంది. మధ్యలో పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేసినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. ఇవాళ చంద్రబాబుకు సంబంధించిన 4 పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ జరనుంది. మరోవైపు ఎప్పటిలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రోజువారి దినచర్య సాగుతోంది. ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి మెడిటేషన్ చేసిన చంద్రబాబు తర్వాత బ్లాక్ కాఫీ తీసుకున్నారు. వార్తాపత్రికలను చదివారు. ఇక
ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మిణి , బాలకృష్ణ సతీమణి వసుంధర, మనవడు దేవాన్ష్ రాజమండ్రిలోనే ఉన్నారు. ఇక నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ కూడా ఇవాళ రాజమండ్రి చేరుకునే అవకాశం
చంద్రబాబు వేసిన క్వాట్ పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో వేసిన క్వాట్ పిటిషన్ మీద హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అలాగే మరో రెండు బెయిల్ పిటిషన్ల మీద కూడా ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి. బెయిల్ కనుక మంజూరు అయితే బాబు ఈరోజు బయటకు వస్తారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు విచారణ మీదనే ఉంది.

Translate this News:











