నీలోఫర్ ఆసుపత్రిలో ఫైజల్ అనే ఆర్నెల్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి తల్లి భోజనానికి వెళ్ళేందుకు బయల్దేరగా…బాబుని ఎత్తుకుంటానని ఓ మహిళ కోరింది. ఆమెను నమ్మి మహిళ చేతికి బాలుడిని ఇచ్చి వెళ్ళింది తల్లి. తిరిగి వచ్చి చూసేసరికి చిన్నారి, మహిళ ఇద్దరూ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లి చుట్టుపక్కల అంతా వెతికింది. ఎంత వెతికినా కనిపించకపోతే భర్తతో కలిసి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..Hyderabad: నీలోఫర్ ఆసుపత్రిలో ఆర్నెల్ల చిన్నారి అదృశ్యం
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఆర్నెల్ల చిన్నారి అదృశ్యమైంది. భోజనానికి వెళుతూ తల్లి బాలుడిని ఓ మహిళ చేతికి ఇచ్చింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇద్దరూ కనిపించలేదు. కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Translate this News:











