Geetha Madhuri and Nandu: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. సెలబ్రిటీల గురించి కొన్ని నిజాలు రాగా మరెన్నో ఫేక్ న్యూస్ కూడా చక్కెర్లు కొడుతుంటాయి. కొందరు సెలబ్రిటీలు వారి గురించి ఏదైనా తప్పుడు వార్తలు ప్రసారమైతే వెంటనే రియాక్ట్ అవుతూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము. తాజాగా సింగర్ గీతామాధురితో విడాకులంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు నటుడు నందు. అది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..గీతామాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందూ..!!
సింగర్ గీతామాధురితో విడాకులంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు నటుడు నందు. అది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని 'మాన్షన్ 24' సినీ ప్రమోషన్లో భాగంగా నందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని తెలిపాడు. అయితే, నందూ క్లారిఫికేషన్ తోనైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

Translate this News:








మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతున్నారని నెటిజన్స్ తెగ వైరల్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్లు కూడా విడాకులు తీసుకున్న నేపథ్యంలో, వీరి విడాకుల వార్తల్లో కూడా నిజం ఉండే ఉంటుందని అందరూ అనుకున్నారు. దీనికి తోడు ఈ వార్తలపై గీతామాధురి, నందు ఇద్దరూ స్పందించకపోవడంతో..ఇది నిజం కావచ్చనే భావనలో ఉన్నారు.



