Sleep Deprivation: చాలా మంది ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం, లేదా ఫోన్స్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో నిద్ర పోకుండా చాలా మంది ఫోన్లు చూస్తూ మేల్కొని ఉంటారు. ఇక్కడ అందరు మర్చిపోతున్న విషయం ఏంటంటే.. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. రోజుకు తప్పక 8 నిద్ర ఉండాలి కానీ కొంత మంది కనీసం 5 గంటలు కూడా పడుకోరు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలేంటో చూడండి..
పూర్తిగా చదవండి..Sleep Deprivation: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..!
ఆరోగ్యానికి, శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. మన మెదడు చురుకుగా పనిచేయాలంటే సరైన నిద్ర తప్పనిసరి. నిద్ర మానసిక.. శారీరక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కానీ కొంత మంది ఏదైనా పనిలో ఉండటం, లేదా ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మరికొంత మంది రాత్రిళ్ళు ఫోన్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం.. రోజుకు కనీసం 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే టైపు-2 మధుమేహం, గుండె సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అసలు నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలేంటో చూడండి..

Translate this News:











