ఇంట్లోనే డ్రగ్స్ దండా నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రాయదుర్గం పోలీసులు (Rayadurgam Police). ఎవరైనా తప్పు చేస్తే పట్టుకొని శిక్షించాల్సిన పోలీసులు.. తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. స్మగ్లర్ల నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని అధికారులకు అప్పజెప్పకుండా ఓ ఎస్సై ఇంట్లోనే దాచుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్సైగా రాజేందర్ ( Si Rajender) పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్లను రాజేందర్ నేతృత్వంలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆ డ్రగ్స్‌ను అధికారులకు గానీ, కోర్టు గానీ అప్పజెప్పకుండా ఇంట్లోనే ఉంచుకోని దందా నిర్వహిస్తున్నాడు ఎస్సై రాజేందర్.
పూర్తిగా చదవండి..drug: డ్రగ్స్ కేసులో ఎస్సై అరెస్ట్.. ఇంట్లోనే దందా
భాగ్యనగర్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. పోలీస్ అధికారి ఇంట్లోనే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్సైని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో ఓ కేసులో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Translate this News:











