Indian Shooters at Asian Games 2023: ఆసియా క్రీడల్లో మనవాళ్ళ పతకాల వేట కొనసాగుతోంది. భారత షూటర్లు అయితే అస్సలు గురి తప్పనివ్వడం లేదు. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పాలక్ గులియా (Palak Gulia) స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇషాసింగ్ (Esha Singh)రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే ఇషా-పాలక్-దివ్య త్రయం మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. పురుషుల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ కేటగిరీలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్ (Aishwarya Pratapsinh Tomar), స్వప్నిల్ కుశాలే (Swapnil Kushale), అఖిల్ షెరాన్ (Akhil sheoran) బృందం ఏకంగా వరల్డ్ రికార్డుతో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.
పూర్తిగా చదవండి..Asian Games 2023: పతకాలు కొల్లగొడుతున్న షూటర్లు, తెలుగు వాళ్ళకు రెండు పతకాలు
ఆసియా క్రీడల ఆరోరోజు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం.

Translate this News:











