ప్రవళిక ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన ప్రవళిక బాయ్‌ఫ్రెండ్ శివరాం రాథోడ్‌ను పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచగా అతను సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్లో సాంకేతిక పొరపాట్లు ఉండటం వల్ల అది తిరస్కరణకు గురైంది. దీంతో శివరాం రాథోడ్ కోర్టు బయటకు రాగా.. అప్పటికే అక్కడ ఉన్న చిక్కడపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక శనివారం శివరాంను గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Pravalika Suicicde Case: మా తమ్ముడు ఏ తప్పు చేయలేదు.. అందుకే బెయిల్ వచ్చింది..
ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడైన శివరాం రాథోడ్‌పై సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు శివరాం రాథోడ్‌కు ప్రవళిలకు ఎలాంటి సంబంధం లేదని.. అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేనందువల్లే కోర్టు శివరాంకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. అతని సోదరుడు తెలిపారు. కానీ ఈ బెయిల్‌కు సంబంధించిన ఆర్డర్ ఇంకా తమకు రాలేదని పేర్కొన్నారు.

Translate this News:











