ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శివసేన (ShivSena) ఫోకస్ పెట్టింది. తెలంగాణలో (Telangana Assembly Elections)పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మధ్యకాలంలో ప్రాంతీయపార్టీలు విస్తరణపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ మహారాష్ట్రలో విస్తరణ వేగవంతం చేస్తోంది. ఈ తరుణంలోనే మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. త్వరలోనే జరుగున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగానే బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు.
పూర్తిగా చదవండి..ShivSena: తెలంగాణ అసెంబ్లీ బరిలో శివసేన ..!!
ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శివసేన నిర్ణయించుకున్నట్లు ఆపార్టీ తెలంగాణ యూనియన్ అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ నియోజకవర్గాలపై తాము దృష్టి సారించినట్లు వివరించారు.

Translate this News:











