Shankar Dada M.B.B.S : తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేస్తు ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ, సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్ మేన్ వంటి చిత్రాలు రీ రిలీజ్లోనూ మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ కోవలోనే, మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ కూడా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శంకర్ దాదా.. చిత్రాన్ని 4కే అల్ట్రా హెచ్ డీ, డాల్బీ సరౌండ్ 7.1 ఫీచర్లతో సరికొత్తగా తీర్చిదిద్దారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!!
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మళ్లీ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు నవంబరు 4న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని 4కేలో సరికొత్తగా తీర్చిదిద్దారు. హిందీలో హిట్టయిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' కు రీమేక్ అయినప్పటికీ, చిరంజీవి ట్రేడ్ మార్కు నటనతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

Translate this News:














