Shani Louk – Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులు బందీగా చేసుకుని నగ్నంగా ఊరేగించిన 22 ఏళ్ల జర్మన్ యువతి షానీ లౌక్ (Shani Louk) సజీవంగా ఉన్నట్టు ఆమె తల్లి తెలిపారు. తన కుమార్తె బతికే ఉందని పాలస్తీనా వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని రికార్డా లౌక్ వెల్లడించారు. కుమార్తె భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె షానీని క్షేమంగా రప్పించే ఏర్పాట్లు చేయాలని జర్మనీ (Germany) ప్రభుత్వాన్ని కోరారు. తన కుమార్తె బతికే ఉందని పేర్కొన్న రికార్డా.. తలకు తీవగ్రాయంతో షానీ బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని పేర్కొన్నారు. కాబట్టి త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని ఓ వీడియోలో జర్మనీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇప్పుడు అధికార పరిధికి సంబంధించి వాదనలు అనవసరమని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Israel Hamas War: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !!
హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి సేఫ్ ఉన్నట్లు ఆమె తల్లి తెలిపారు. మ్యూజిక్ఫెస్ట్ నుంచి యువతిని బంధించి తీసుకెళ్లిన హమాస్ ఉగ్రవాదులు..ఆమెను పికప్ ట్రక్‌పై నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యువతి చనిపోయిందని వార్తలు వినిపించాయి. కాగా, తన కుమార్తె బతికే ఉందని తల్లి రికార్డా పేర్కొంది. తన కూతురు షానీ తలకు తీవగ్రాయంతో బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని, తన కుమార్తెను రక్షించాలని జర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Translate this News:











