కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలోని రామేశ్వర్ పల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షబ్బీర్ అలీ పరిశీలించారు. మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన ఆయన.. బాధితులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షబ్బీర్ అలీ.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 1500 కోట్లతో ప్రగతి భవన్‌ను, 15 వేల కోట్లతో సచివాలయాన్ని నిర్మించుకున్న కేసీఆర్ ప్రజలకు మాత్రం నీటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.
పూర్తిగా చదవండి..Shabbir Ali: కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది
సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1500 కోట్లతో ప్రగతి భవన్‌ను నిర్మించుకున్న కేసీఆర్.. ప్రజలకు మాత్రం నీటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.

Translate this News:











