సీఎం కేసీఆర్పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టక ముందే దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే గంపా గోవర్డన్ను బుజ్జగిస్తున్నారన్న ఆయన.. అందులో భాగంగానే కేసీఆర్ గంపా గోవర్డన్కు బహుమతిగా 195 కోట్ల ప్రజాధనం ఇచ్చారని ఆరోపించారు. గోదావరి జలాలను కామారెడ్డి ప్రజలు 15 సంవత్సరాల నుంచి తాగుతున్నారన్నారు. కేసీఆర్ సాగునీరు గురించి చెప్పాలని ఆడిగితే కమీషన్ల కోసం తాగునీరు గురించి చెబుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలకు సంబంధించిన పైప్ లైన్లు సైతం నాసిరకంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Shabbir Ali: కేసీఆర్ కామారెడ్డికి రాకముందే దోపిడీకి పాల్పడ్డాడు
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టక ముందే దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే గంపా గోవర్డన్ను సీఎం కోట్ల రూపాయల ప్రజాధనం ఇచ్చారని ఆరోపించారు.

Translate this News:











