దేశీయ మార్కెట్లు నాలుగు రోజులుగా పడిపోతూనే ఉన్నాయి. ఉదయం ప్రారంభమైనప్పుడు లాభాలతో ఉన్నప్పటికీ కాసేపటికే డౌన్ ట్రెండ్ లోకి వచ్చేశాయి. మళ్ళీ మధ్యాహ్నం టైమ్ కి పుంజుకుని టాప్ కి వెళ్ళాయి. కానీ చివరకు అమ్మకాల ఒత్తిడితో రోజు ముగిసేసరికి నష్టాలను మూటగట్టుకున్నాయి దేశీయ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు ఈరోజు కూడా దేశీయ మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. దాంతో పాటూ భారత్-కెనడా మధ్య పరిణామాలు కూడా మార్కెట్ ను నష్టాల్లో పడేశాయి. అయితే జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్ల బాండ్ ఇండెక్స్ లో భారత చేరడం అంశం మాత్రం లాభాలనే చూకూర్చిందని చెప్పొచ్చు.
పూర్తిగా చదవండి..నాలుగో రోజూ నష్టాల్లోనే దేశీయ మార్కెట్లు
వరుసగా నాల్గవ రోజు కూడా దేశీయ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.10 పాయింట్లు నష్టపోయి 18,674.25 దగ్గర ముగిసింది.

Translate this News:











