సాధారణంగా కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందని, జగన్రెడ్డి పాలనలో మాత్రం కరెంట్ తీగ అవసరం లేదని, బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి (TulsiReddy) ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్రెడ్డి (cm jagan) వైసీపీ అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఊరూవాడ ఊదరగొట్టారని, ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు.. దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచారని, దాని పర్యవసానంగా విద్యుత్ వినియోగదారులపై 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..ap election: వైసీపీకి రివర్స్ షాక్ తప్పదు.. తులసీరెడ్డి హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వం కూతల, కోతల, వాతల ప్రభుత్వంగా తయారైందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి అన్నారు. ఒకవైపేమో కరెంట్ కోతలు, మరోవైపు విద్యుత్ బిల్లుల వాతలు ఎక్కువయ్యాయని చెప్పారు.

Translate this News:











