‘ప్రేమ దేశం’హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో ఒక ఊపు ఊపేశాడు అబ్బాస్. హీరోగా, విలన్ గా, తమ్ముడిగా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో రకాల పాత్రలు చేశారు. ముఖ్యంగా అబ్బాస్ హెయిర్ కటింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. ‘అబ్బాస్ హెయిర్ కటింగ్’ అని చాలా మంది ఇప్పటికే చేయించుకుంటారు. ఇక ఉండే కొద్దీ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో.. ఆయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ చాలా రకాల పనులు చేశారు అబ్బాస్.
పూర్తిగా చదవండి..విశాల్ కి నాకు అందుకే పడదు.. కీలక వ్యాఖ్యలు చేసిన అబ్బాస్
విశాల్ పై పగ అని చెప్పలేని కానీ.. కోపం మాత్రం ఉందని చెప్పారు. నా విషయంలో తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం.. అది నాకు నచ్చలేదు.. కానీ అతన్ని ఎప్పుడో నేను క్షమించాను అని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా విశాల్ ఎదురుపడితే హాయ్ అని పలకరిస్తాను.. కానీ క్లోజ్ గా మాత్రం ఉండలేనంటూ అబ్బస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలోని నటులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. ఈ లీగ్ సెకండ్ సీజన్ లో విశాల్ నా గురించి అబద్దాలు చెప్పాడు..

Translate this News:











