Libya Death toll may increase upto 20,000: ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా మృతదేహాలే కనిపిస్తున్నాయి..కాపాడాలంటూ ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఆఫ్రికా దేశం లిబియాలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. కుండపోతకు వరదలు ముంచెత్తాయి. రెండు భారీ డ్యామ్స్ బద్దలవడంతో వరద పోటెత్తి ప్రజలను సముద్రంలోకి లాక్కెళ్లింది. పెద్ద పెద్ద భవనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కన్నీటి దృశ్యాలే కళ్లకు కడుతున్న లిడియాలో ఇప్పటివరకు 5 వేల 100 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో 10వేల మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
20 వేల మంది చనిపోతారా?
లిబియాలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) చెప్పిన లెక్కల ప్రకారం వరదల ధాటికి కనీసం 30,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు. ఇది డేనియల్ తుఫాను కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది. బెంఘాజీతో సహా ఇతర తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 6,085 మంది నిరాశ్రయులయ్యారని, మరణాల సంఖ్య ఇంకా ధృవీకరించలేదని IOM తెలిపింది. శనివారం రాత్రి లిబియా ఉత్తర తీరాన్ని డేనియల్ తుఫాను తాకింది. మరణాల సంఖ్య విషయంలో స్పష్టమైన లెక్కలు లేవు. లిబియా వరద మృతుల సంఖ్య 20,000 దాటవచ్చని భయాలు నెలకొన్నాయి. 20,000 మరణాలు సంభవించినట్లు అల్-బైడా మెడికల్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్ మాజిక్ నుంచి ఈ సమాచారం వచ్చింది.
Libya Death toll: జల ప్రళయంలో 20 వేల మంది చనిపోతారా? లిబియాలో గుట్టలు గుట్టలుగా శవాలు!
లిబియాలో డేనియల్ తుఫాన్ జల ప్రళయం సృష్టించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) చెప్పిన లెక్కల ప్రకారం వరదల ధాటికి కనీసం 30,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య 20 వేల దాటవచ్చని సమాచారం. తూర్పు ప్రాంతాలతో పాటు పశ్చిమాన ఉన్న మిస్రాటా నగరం కూడా వరద తాకిడికి గురైంది. మరోవైపు ప్రజలు విలవిలలాడిపోతున్నా సహాయకచర్యలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి.

Translate this News:











