స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్‌కి ఉండే క్రేజ్ చాలా ఎక్కువ. ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐ జాబ్స్‌కి అప్లై చేసుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. క్లర్క్, పీఓ జాబ్స్‌తో ఎస్ఓ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే వారు కూడా ఉంటారు. ఎస్బీఐ(SBI)లో వివిధ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత నెల 16న నోటిఫికేషన్ విడుదలవగా.. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే ఈ డెడ్‌లైన్‌ని అ నెల 21 వరకు పొడిగించారు. దీంతో ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..SBI Jobs: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా www.sbi.co.in అధికారిక వెబ్సైట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 439 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు డేట్‌ని అక్టోబర్ 21వరకు పొడిగించారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.

Translate this News:











