SBI Apprentice Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలైంది. ఇవాళ్టి(సెప్టెంబర్ 1) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసుకోవచ్చు. sbi official website చివరి తేదీ సెప్టెంబర్ 21. ఈ ప్రొగ్రెమ్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. విద్యార్థులకు నెలకు రూ.15,000 స్టైఫండ్‌ను అందిస్తుంది. ఆన్లైన్ పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్‌లో షెడ్యూల్ చేశారు. రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.
ఎలా దరఖాస్తు చేయాలి:
Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6,160 పోస్టులకు SBI నోటిఫికేషన్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆరు వేలకు పైగా అప్రెంటీస్‌ల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో మొత్తం 6160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎస్బీఐ(SBI) అప్రెంటీస్‌కు జీతం నెలకు 15,000.

Translate this News:











