తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి 30 శాతం పీఆర్సీ పెంచుతూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 583 మంది కళాకారులను గుర్తించిన ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించింది. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.24,514 వేతనం ఇస్తుండగా తాజా పెంపుతో రూ.31,868 జీతం అందనుంది. ఇప్పుడు అమల్లోకి వచ్చిన పీఆర్సీ ప్రకారం ఒక్కొక్కరి జీతం దాదాపు 7,300 మేర పెరగనుంది. కొత్త వేతనాలు 2021 జూన్ 1 నుంచి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు వేతనాలు పెంపు
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Translate this News:












