Salaar Leaks: ప్రభాస్ ‘సలార్’ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. K.G.F సినిమా వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ ఫైనల్ గా డిసెంబర్ 22 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీకైనట్లు సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఆఫ్రికన్ ట్రైబల్స్ తో షూట్ చేస్తున్న సన్నివేశాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ డ్యూయల్ రోల్ కనిపించనున్నాడని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తల్లో వాస్తవమెంత, అవాస్తమెంత అనేది తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Salaar Leaks: లీకైన ‘సలార్’ షూటింగ్ ఫొటో.. చూస్తే షాకవుతారు!
ప్రభాస్ 'సలార్'.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో ఆఫ్రికన్ ట్రైబల్స్ తో షూట్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలో వాస్తవమేంటి అనేది తెలియాల్సి ఉంది.

Translate this News:











