నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా నాగ చైతన్యతో సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే దర్శకుడు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. చాలా సార్లు వర్క్ షాప్ చేసిన తర్వాతనే సినిమాను పక్క ప్రణాళికతో మొదలుపెట్టారు. ప్రీ పొడక్షన్ లో భాగంగా నాగచైతన్య శ్రీకాకుళం వెళ్ళడం, అక్కడ జాలర్లను అకలవడం వంటివి చేవారు. అంతేకాదు సముద్రం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ మెషిన్ బోటులో కూడా ప్రయాణంచేశారు. వీటికి సంబంధించిన వీడియో కొన్నాళ్ళ క్రితం చాలా పాపులర్ అయింది. 2018 లో గుజరాత్ నుంచి సముద్రతీరంలో వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కారు. అందులో ఒకరైన రామారావు జీవిత ఆధారంగానే ఈ సినిమాను దర్శకుడు ఇప్పుడు చూపించబోతున్నాడు. ఆతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అందుకే చై అక్కడకు వెళ్ళి వాళ్ళ జీవన విధానం తెలుసుకుని మరీ వచ్చాడు.
పూర్తిగా చదవండి..నాగచైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి…
నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది.

Translate this News:











