భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో బుధవారం రాత్రి అపశృతి జరిగింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తూండగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనపై మర్వాక ముందే.. గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లి నీటమునిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నీటమునిగిన ముగ్గురిలో ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యువకులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
పూర్తిగా చదవండి..Ganesh Nimajjanam: నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు మృతి.. నిమజ్జనం చేస్తూ తండ్రీకొడుకులు (వీడియోలు)
గణేష్ నవరాత్రులు పూజలు దేశ వ్యాప్తంగా పూర్తయ్యాయి. వైభవంగా గణేష్డి శోభాయాత్రలు కొనసాగుతోంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డీజే సౌండ్స్, డ్యాన్సులులతో బొజ్జగణపయ్య నిమజ్జనం రాష్ట్ర నలు మూలన సందడితో పాటు..అక్కడక్కడ అపశృతులు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంటున్నాయి.

Translate this News:











