Sachin Tendulkar to launch trailer of Muttiah Muralitharan biopic ‘800’:
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించిన లెజెండరీ ప్లేయర్. ఆయన బయోపిక్‌గా ‘800’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ముంబైలో లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ విడుదల చేసేది ఎవరో తెలుసా? గ్రౌండ్లో ముత్తయ్య ప్రత్యర్థి అయిన క్రికెట్ గాడ్, లెజండరీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ ఓ వీడియో విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..











