రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు (Russian President Vladimir Putin) గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 9:05 గంటల సమయంలో ఆయన గుండె పోటుకు గురైనట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు టెలిగ్రామ్ ఛానెల్ ‘జనరల్ ఎస్విఆర్’ను ఉటంకిస్తూ ఈ మీడియా నివేదికలు వస్తున్నాయి. గుండె పోటు రావడంతో ఆయన బెడ్ రూంలో కింద పడిపోయినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన టేబుల్ పై ఉన్న ఆహార పదార్థాలను తన్ని వేసినట్లు తెలుస్తోంది. దీంతో అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దగా శబ్ధం రావడంతో సిబ్బంది వచ్చి చూడగా ఆయన మెలికలు తిరిగిపోతూ కింద పడి కనిపించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్..
Breaking: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుండె పోటు?
రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు గురయ్యారంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే.. ఆ దేశ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై స్పందించలేదు.

Translate this News:











