రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. అతడ్ని పరామర్శించడానికి వెళ్తే అడ్డుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తోన్నారని డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిర్మల్ వస్తున్నానని తెలిసే పోలీసులు అక్కడ 144 సెక్షన్ అములు చేశారని ఆరోపించారు. ఇందలవాయి వద్ద పోలీసులు తనను అడ్డుకున్నారని డీకే అరుణ తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని, అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు తనను బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు.
పూర్తిగా చదవండి..DK Aruna: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంతలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో విపక్షనేతలు రోడ్లపై తిరిగినా తప్పే అవుతుందని విమర్శించారు.

Translate this News:











