ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో తన సత్తా చాటాడు. బుధవారం విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా… రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ 9వ ర్యాంక్ లో ఉన్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో డకౌట్ అయిన రోహిత్.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Rohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్లో సత్తా చాటిన హిట్‌మ్యాన్..
స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు.

Translate this News:











