Road Accident Video: రోడ్డుపైనే కాదు రోడ్డు పక్కన నడవాలంటే కూడా ప్రజలు భయపడుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా, ప్రాణాలకు నో గ్యారంటీ అనే విధంగా కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘోర ప్రమాదం ఒకటి కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలనే సూచన చేశారు.
పూర్తిగా చదవండి..వామ్మె.. ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా ప్రాణాలకు నో గ్యారంటీ..!!
రోడ్డుపైనే కాదు రోడ్డు పక్కన నడిచినా భద్రత లేకుండా పోతోంది. కర్ణాటకలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఆ వీడియోలో ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్న యువతులపైకి కారు దూసుకుపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న వారిని తొక్కుకుంటూ, ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Translate this News:











