Kadapa District Road Accident: కడప జిల్లా ఎర్రగుంట్ల (Errguntla)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఎర్రగుంట్ల – పొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కళ్యాణ మండపం (SV Kalyana Mandapam) వద్ద ఆర్టీసీ బస్సు- ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను కడప జిల్లా ఆజాద్‌నగర్ కాలనీ (Azadnagar Colony)కి చెందిన మహమ్మద్ (25), హసీనా(25), అమీనా(20), షాకీర్(10) గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి మల్లెల (Mallela) వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు (Proddatur) ప్రభుత్వాస్పత్రి (Govt Hospital)కి.. మృతులను పోస్ట్‌పార్టం నిమిత్తం తరలించారు. నలుగురు ఒక్కసారి మరణించడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొన్నది. నలుగురు మృతులతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో నలుగురు మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- ఆటో రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగరికి గాయాలయ్యాయి.

Translate this News:











