టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది విధులకు గైర్హాజయ్యారు. నలుగురు గన్మెన్లతో రాచకొండ పోలీసులు రేవంత్‌కి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే ఇటీవల రేవంత్ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ విధులకు డుమ్మా కొట్టారు. తాము రేవంత్ దగ్గర పనిచేయలేమని ఉన్నతాధికారులకు చెప్పడంతో వేరే సిబ్బంది పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క గన్‌మెన్‌ను కూడా నువ్వు కూడా ఎందుకు వెళ్లిపో అని రేవంత్ చెప్పడంతో అతను కూడా రావడం లేదని సమాచారం. దీంతో సెక్యూరిటీ లేకుండానే రెండు రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై నాగర్ కర్నూలులో కేసు కూడా నమోదైంది.
పూర్తిగా చదవండి..గన్మెన్లు లేకుండానే జనాల్లోకి రేవంత్ రెడ్డి.. కారణం ఏంటంటే?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది.

Translate this News:











