Srinivasa Reddy: ప్రభుత్వం అర్థరాత్రి జీవో ఇచ్చిన విధంగా బీజేపీ పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేసిందని బీజేపీ బహిష్క్రత నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీజేపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..తనకు స్పెషల్ లాఠీలు పోలీసులు కొత్తేంకాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇలాంటి వాటిని అనేక సార్లు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. ప్రశ్నించే పార్టీకోసం పని చేసేవారికే అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసులు వస్తుంటాయన్నారు. తాను పార్టీకోసం కష్టపడి పని చేశానని, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోతే ప్రశ్నించినట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్‌గా పార్టీనుండి తీసేశారు
బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్‌కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.

Translate this News:











