గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఇప్పుడు ఒకొక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో టమాటా ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. మదనపల్లి మార్కెట్లో శనివారం క్వింటా టమాటా ధర వెయ్యి రూపాయలకంటే తక్కువగానే పలికింది. దీంతో కిలో టమాటా 10 రూపాయల కంటే తక్కువకే లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రైతు బజార్లో కిలో టమాటాను 30 రూపాలయ నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమాటా దిగుబడి అధికంగా ఉండటంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో క్వింటా టమాటా ధర 700 రూపాయలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Tomato: సామాన్యులకు రిలీఫ్.. పడిపోయిన టమాటా ధరలు
గత కొంతకాలంగా హడలెత్తించిన టమాటా ధరలు ఒక్కసారిగా డమాల్ మన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో క్వింటా టమాటా వెయ్యి రూపాయలు పలికింది. అనంతపురం, కర్నూల్ జిల్లాల నుంచి దిగుమడి పెరగడంతో రేట్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Translate this News:











