Israel-Hamas Conflict:ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ఐరాస (UN) తీవ్రంగా పరిగణిస్తోంది. వెంటనే ఇరు పక్షాలు దాడులు ఆపాలని విజ్ఞప్తి చేస్తోంది. దారుణమైన పరిస్థితుల్లో నేను రెండు విజ్ఞప్తులను చేయాలనుకుంటున్నాను అని ఐరాస ఛీఫ్ ఆంటోనియా గుటెరస్ (António Guterres) అన్నారు. హమాస్ వెంటనే తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టాలని…ఇజ్రాయెల్ కూడా గాజా వాసులకు సహాయం అందించాలని ఆయన కోరారు. గాజాలో నీరు, ఆహారం,వద్యుత్ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాసకు చెందిన ఆహారం, నరు.ఇతర వస్తువులు, మందులు ఈజిప్ట్, జోర్డాన్, వెస్ట బ్యాంక్, ఇజ్రాయెల్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని కొన్ని గంటల్లో గాజాకు తరలించవచ్చని…ఇజ్రాయెల్ సౌన్యం వీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆయన కోరారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas conflict: బందీలను వెంటనే విడిచిపెట్టేయండి-హమాస్‌కు ఐరాస విజ్ఞప్తి
ఇజ్రాయెల్, మమాస్ మధ్య దాడులు తీవ్ర అవుతున్నాయి. వందల్లో ప్రాణాల్లో పోతున్నా ఇరు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. దీని మీద ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని ఐరాస ఛీఫ్ గుటెరస్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది.

Translate this News:











