Vizianagaram Train Accident: జూన్, 2023లో ఒడిశా… బాలాసోర్ జిల్లాలోని బహనాగా స్టేషన్ దగ్గరలో రాత్రి 7 గంటల సమయంలో రైలు ప్రమాదం జరిగింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఆగివున్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పిన తర్వాత ఆ బోగీలను యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఆ మూడు రైళ్ల ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పగా.. 275 మంది చనిపోయారు. కరెక్ట్‌గా ఇదే తరహాలో నిన్న రాత్రి 7.10 సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ముందు ఆగివున్న ప్యాసింజర్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత విద్యుత్ వైర్లు తెగిపోయాయి.
పూర్తిగా చదవండి..Vizianagaram Train Accident:రాయగడ-పలాస రైలు ప్రమాదానికి కూడా కారణం కవచ్ సిస్టమే లేకపోవడమే.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయింది...వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లను నడిపిస్తున్నాము. అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలాగే అనిపిస్తోంది. మరి ఆ ప్రమాదం నుంచి రైల్వే అధికారులు పాఠాలు నేర్చుకోలేదా? అయినా కూడా మళ్ళీ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేస్ పెట్టిన కవచ్ సిస్టమ్ ఏమైందని అడుగుతున్నారు.

Translate this News:











