Ravi Shastri Fires On Team India: శిఖర్ ధావన్ 2015 ప్రపంచ కప్..2019 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు విజయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ, టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా నిలపడంలో ధావన్‌దే ప్రధాన పాత్ర. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు టీమ్ ఇండియా ప్లాన్‌లో లేడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లకు ముందు ఒక్క సిరీస్‌లో కూడా అతనికి అవకాశం రాకపోవడానికి ఇదే కారణం. ఆసియా కప్, ఐర్లాండ్ సిరీస్‌ల కోసం భారత్-బీ జట్టులో కూడా అతనికి చోటు లభించలేదు. ఈ డాషింగ్ ఓపెనర్‌కు సంబంధించి టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
పూర్తిగా చదవండి..Dhawan : ధావన్‌కి అన్యాయం జరిగింది..టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్..!!
టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా తన ప్రస్తానాన్ని ప్రారంభించి అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్చాడు శిఖర్ ధావన్. అయితే కొంతకాలం నుంచి అతను కేవలం కొన్ని మ్యాచ్‌లకే మాత్రమే పరిమితమయ్యాడు. డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్ తో చివరి వన్డే సిరీస్ ఆడాడు. అప్పటి నుంచి అతను టీమిండియాకు సెలక్ట్ కాలేదు. భారత్-బి టీమ్ లో కూడా ధావన్ కు చోటు దక్కలేదు. అయితే శిఖర్ ధావన్ కు అన్యాయం జరిగిందంటూ రవిశాస్త్రి టీమిండియాపై ఫైర్ అయ్యారు.

Translate this News:











