ఖమ్మం జిల్లా వైరాలో దారుణం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. మంచి చదువులు చదివి.. ఉన్నత స్థాయికి చేరుకుంటారని పిల్లల తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివించాలంటే భయం వేస్తుంటున్నారు తల్లిదండ్రులు. వరగా జరుగుతున్న సంఘటనలు చూసి విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. తాజాగా ఓ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల వసతి గృహంలో ఎలుకల కలకలం సృష్టించాయి. నిద్రిస్తున్న పదిమంది బాలికలను మూడురోజుల క్రితం ఎలుకలు కరిచాయి. తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా సిబ్బంది ఇవ్వటం లేదు. రోజుకు ముగ్గురు చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను లోనికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. బాలికల వసతి గృహంలోకి అనుమతించమంటూ సమాధానం చెబుతున్నారు. విషయం బయటికి రావడంతో బాధిత బాలికలను వసతిగృహంలోనే ఉంచి చికిత్స తీసుకుంటున్నారు. వసతిగృహం సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana News: ఖమ్మం జిల్లాలో దారుణం.. గురుకుల విద్యార్థులను ఎలుకలు కొరికిన వైనం.. వివరాలివే!
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో వరసగా ఏదో ఒక్క ఘటన జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం మర్వకముందే ఖమ్మంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటంతో.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు

Translate this News:











