రణబీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది మూవీ టీమ్. ఇందులో భాగంగా మూవీలోని ప్రధాన పాత్రల పోస్టర్లను ఒక్కొక్కరివీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రణబీర్ లుక్ రివీల్ చేశారు. రీసెంట్ గా సీనియర్ నటుడు అనిల్ కపూర్ లుక్ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లుక్ రిలీజ్ చేశారు. చక్కగా చీర కట్టుకొని, చాలా కూల్ గా కనపడుతున్న రష్మిక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
పూర్తిగా చదవండి..movies:అబ్బా…నేషనల్ క్రష్ రష్మిక భలే ఉందిగా…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ గురించి బాలీవుడ్ తెగ ఎదురు చూస్తోంది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా...టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Translate this News:












