ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసింది. శరవేగంగా జరుగుతున్న ఆలయ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రామమందిరానికి సంబంధించి ఓ కీలక ప్రకటన వెల్లడైంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు తేదీ ఖరారైపోయింది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అంగీకరించారు.
పూర్తిగా చదవండి..Ram Mandir Inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం..
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తేది ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని.. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టమని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Translate this News:











