తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, ఆయనొక్కడే హీరో కాదని యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. 1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, ఆ సమయంలో గెలిచిన రెండింటిలో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారన్నారు. 27 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉందని, అభివృద్ధికి రోల్ మోడల్‌గా గుజరాత్ నిలిచిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
పూర్తిగా చదవండి..Rajnath singh: ఆయనొక్కడే తోపా..! కేసీఆర్‌పై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, ఆయనొక్కడే హీరో కాదని యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. కేసీఆర్ కుటుంబం.. ఆయన పరివారం మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారని, ప్రజలు బాగుపడలేదని తెలిపారు.

Translate this News:











