Rajinikanth very excited to act with Amitabh Bachchan: జైలర్ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ 170వ సినిమాను ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞాన్వేల్ ‘తలైవర్ 70’ వర్కింగ్ టైటిల్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కేరళలలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ను రజినీకాంత్ వెల్లడించారు. ‘తలైవర్ 170′(వర్కింగ్ టైటిల్)లో ఇండియన్ మూవీ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని తెలియజేశారు. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోతో తలైవా ఒక ట్వీట్ చేశారు. 33 సంవత్సరాల తరువాత మళ్లీ తన గురువైన అమితాబ్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రజనీకాంత్.
పూర్తిగా చదవండి..ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‌బీతో సూపర్ స్టార్ మల్టీస్టారర్.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
బిగ్ బితో 33 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నాడు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ అమితాబ్ బచ్చన్‌తో, నా 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది'అని పోస్ట్ చేశారు రజినీకాంత్.

Translate this News:













