ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలపై కుటుంబంలో కలహాలు, భూ వివాదాలు జరగడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవల్లో ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం, చివరికి హత్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూ వివాదం విషయంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే ఆ వ్యక్తిని చంపిన నిందితుడు అతని సోదరుడే కావడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే.. నిర్పత్ గుర్జర్, దామోదర్ గుర్జర్ అనే ఇద్దరు వ్యక్తులు అన్నాదమ్ముళ్లు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఓ భూ వివాదం విషయంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Watch Video: గుండె ధైర్యం చేసుకొని చూడండి.. ట్రాక్టర్‌తో తొక్కించి దారుణ హత్య..
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ భూవివాదం విషయంలో ఓ వ్యక్తిని ఏకంగా ట్రాక్టర్‌తో తొక్కించడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 సార్లు ఆ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Translate this News:











