ప్రముఖ సినీ నటుడు, రచయిత, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి (Posani Krishna Murali) ఏపీలోని రాజమండ్రి కోర్టు షాక్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ పై (Pawan Kalyan) ఆయన అనుచిత వాఖ్యలు చేశారని జనసేన పార్టీ నేతలు (Janasena Party Leaders) రాజమహేంద్రవరం పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ పై స్పందించడం లేదని, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో వారి వాదనలు విన్న న్యాయస్థానం పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి పై IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాజమండ్రి పోలీసులు.
ఇది కూడా చదవండి: Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..
Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు.. కారణమిదే!
ప్రముఖ సినీ నటుడు, రచయిత, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి ఏపీలోని రాజమండ్రి కోర్టు షాక్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేసిన విషయంపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Translate this News:











