Telangana Rain alert: అసలు వర్షాలు పడడం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సెప్టెంబర్లోనూ ఉక్కపోత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కురిస్తే కుంభవృష్టి లేకపోతే అసలు చుక్కే లేని దుస్థితి. వరుణ దేవుడితో ఇదే చికాకు. అయితే సెంచరీ, డబుల్ సెంచరీ బాదుతాడు.. లేకపోతే డకౌట్ అవుతాడు. అంతేకానీ కాసేపు క్లాసిక్గా షాట్స్ ఆడుతూ, మధ్యమధ్యలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఆనందపరచాలని అనుకోడు. హ్యాపీగా చిరుజల్లుల్లో తడిచి ముద్దై చాలా కాలం అయ్యింది కదా.. అయితే ఇక మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. చిరుజల్లులకు సమయం అసన్నమైంది. రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు.. అంటే సెప్టెంబర్ 20,21 తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని చెప్పింది.
పూర్తిగా చదవండి..Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ ఎలర్ట్.. రెండు రోజులు పాటు వర్షాలు..!
సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురుస్తాయి. ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ చెప్పింది.

Translate this News:











